Gadde Rammohan: సజ్జల అన్నీ అబద్ధాలే చెపుతున్నారు: గద్దె రామ్మోహన్

Gadde Rammohan telling lies says Gadde Rammohan
  • కృష్ణానది కరకట్టను వైసీపీ ప్రభుత్వం నిర్మించిందని సజ్జల చెపుతున్నారని గద్దె విమర్శ
  • అక్కడి ప్రజలను అడిగితే ఎవరు నిర్మించారో చెపుతారని వ్యాఖ్య
  • అసెంబ్లీలో వాస్తవాలను చెప్పకుండా తమ గొంతు నొక్కుతున్నారని మండిపాటు

విజయవాడ కృష్ణానది రీటెయింగ్ వాల్ గురించి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ అబద్ధాలే చెపుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విమర్శించారు. కృష్ణా వరదల నుంచి అక్కడి ప్రజలకు రక్షణ కల్పించాలని గతంలో తాము అనేక ధర్నాలు, జల దీక్షలు చేశామని చెప్పారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరకట్ట నిర్మాణంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. 

5 కిలోమీటర్ల మేర మూడు విడతలుగా రీటెయిల్ వాల్ నిర్మించాలని చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. కరకట్టను తాము నిర్మిస్తే... వైసీపీ ప్రభుత్వమే చేసిందని సజ్జల చెప్పుకోవడం దారుణమని మండిపడ్డారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను అడిగితే కరకట్టను ఎవరు నిర్మించారో చెపుతారని అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ తమ గొంతు నొక్కుతున్నారని... వాస్తవాలను ప్రజలకు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News