New Delhi: ఢిల్లీలో నెహ్రూ పేరిట ఉన్న మ్యూజియం పేరు మార్పు

  • నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రెరీ సొసైటీగా మార్పు
  • సోషల్ మీడియాలో వెల్లడించిన మ్యూజియం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డైరెక్టర్
  • ప్రజాస్వామీకరణలో భాగంగా ఈ చర్య చేపట్టినట్టు వెల్లడి 
Centre renames Delhi museum named after Nehru

దేశరాజధాని న్యూఢిల్లీలోని ప్రముఖ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రెరీ పేరును కేంద్రం తాజాగా మార్చింది. మ్యూజియం కొత్త పేరు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రెరీ సొసైటీగా ఖరారు చేసింది. ఈ మేరకు మ్యూజియం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డైరెక్టర్ నృపేంద్ర మిశ్రా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పేరును అధికారికంగా మార్చారు. ప్రజాస్వామీకరణ క్రతువులో భాగంగా ఈ మార్పు చేసినట్టు నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. 

సొసైటీ వైస్‌ ప్రెసిడెంట్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జూన్‌లో జరిగిన ఓ సమావేశంలో పేరుమార్పు నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొన్ని విధానపరమైన లాంఛనాలు పూర్తి చేసేందుకు కొంత సమయం పట్టిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 14 నుంచి కొత్త పేరు అమల్లోకి రావాలని అప్పట్లో మ్యూజియం అధికారులు నిర్ణయించారు. 

More Telugu News