Shilpa Shetty: చెప్పులేసుకుని జాతీయ జెండా ఎగరేసిన శిల్పా శెట్టిపై విమర్శలు.. దీటుగా జవాబిచ్చిన నటి

Shilpa Shetty hits back after being trolled for hoisting Indian flag with shoes on
  • తన నివాసంలో జాతీయ జెండా ఎగరేసిన నటి శిల్పా శెట్టి 
  • నెట్టింట్లో వీడియో షేర్ చేసిన వైనం
  • వీడియోలో నటి చెప్పులేసుకుని జెండా ఎగరేస్తూ కనిపించడంతో మొదలైన ట్రోలింగ్
  • విమర్శకులకు దీటుగా జవాబిచ్చిన శిల్ప 
  • చెప్పులేసుకోకూడదన్న నియమం ఫ్లాగ్ కోడ్‌లో లేదని స్పష్టీకరణ

నెట్టింట్లో తరచూ ట్రోలింగ్ బారిన పడే నటీనటుల్లో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కూడా ఒకరు. అయితే, తాజాగా ఆమె ట్రోలర్లకు దీటుగా జవాబిచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన నివాసంలో జాతీయజెండా ఎగురవేసిన ఆమె ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట పంచుకుంది. వీడియోలో, శిల్ప చెప్పులేసుకుని జాతీయ జెండా ఎగరేయడంతో ట్రోలింగ్‌ మొదలైంది. అయితే, ఈసారి ఏమాత్రం వెనక్కు తగ్గని శిల్ప ట్రోలర్ల భరతం పట్టింది.

త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే సమయంలో పాటించాల్సిన నిబంధనల (ఫ్లాగ్ కోడ్) గురించి తనకు పూర్తి అవగాహన ఉందని శిల్ప స్పష్టం చేసింది. చెప్పులేసుకోకూడదన్న నియమం ఫ్లాగ్ కోడ్‌లో ఎక్కడా లేదని ఆమె స్పష్టం చేసింది. తన వాదనకు బలం చేకూర్చేలా గూగుల్‌లో ఓ ఆర్టికల్‌ను వెతికి మరీ నెట్టింట షేర్ చేసింది. ట్రోలర్లు తమ అవగాహనా రాహిత్యాన్ని ప్రదర్శించడం, ప్రతికూల వాతావరణాన్ని సృష్టించడాన్ని తాను అస్సలు సహించనని మొహం వాచేలా చివాట్లు పెట్టింది. వాస్తవాలు తెలుసుకోవాలంటూ వారిని మందలించింది. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇక శిల్ప త్వరలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌లో నటించనుంది. ఇండియన్ పోలీస్ ఫోర్స్ పేరిట నిర్మితమవుతున్న ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతుంది.

  • Loading...

More Telugu News