Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వ దర్శనానికి 15 గంటల సమయం!

  • శ్రీవారి దర్శనం కోసం 25 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,726 మంది భక్తులు
Tirumala crowd details

హిందువులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ ఉదయం స్వామివారి దర్శనం కోసం 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. అయితే కంపార్ట్ మెంట్లలో ఉన్న భక్తులకు ఏ ఇబ్బంది రాకుండా టీటీడీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మరోవైపు నిన్న శ్రీవేంకటేశ్వర స్వామి వారిని 78,726 మంది దర్శించుకున్నారు. 26,436 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ. 3.94 కోట్ల ఆదాయం వచ్చింది.  

ఇంకోవైపు శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు.

More Telugu News