Klin Kaara Konidela: అమ్మమ్మ, తాతయ్యతో కలిసి జెండా ఎగరేసిన కొణిదెల క్లీంకార

Mega Princess Klin Kaara Konidela participates in flag hoisting
  • ఇవాళ ఆగస్టు 15... భారత స్వాతంత్ర్య దినోత్సవం
  • ఫామ్ హౌస్ లో ఉపాసన తల్లిదండ్రుల జెండా పండుగ
  • చిన్ని చేతులతో జెండా తాడు పట్టుకున్న క్లీంకార
  • వెలకట్టలేని క్షణాలు అంటూ ఫొటోలను పంచుకున్న ఉపాసన

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల కుమార్తె క్లీంకార కొణిదెల ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో పాలుపంచుకుంది. ఇవాళ ఆగస్టు 15 సందర్భంగా అమ్మమ్మ శోభా కామినేని, తాతయ్య అనిల్ కామినేనిలతో కలిసి క్లీంకార మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంది. 

ఫామ్ హౌస్ లో అమ్మమ్మ ఎత్తుకుని ఉండగా, క్లీంకార తన చిన్ని చేతులతో జెండా తాడును పట్టుకుని లాగుతున్నప్పటి ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

"వెలకట్టలేని క్షణాలు ఇవి... అమ్మమ్మ, తాతయ్యతో కలిసి క్లీంకార తొలి స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంది" అని ఉపాసన వెల్లడించారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు 2012లో పెళ్లి చేసుకోగా, ఇన్నాళ్లకు పండంటి పాపాయి జన్మించింది. జూన్ 20న ఉపాసన ప్రసవించిన సంగతి తెలిసిందే. ఆ పాపకు క్లీంకార అని నామకరణం చేశారు.

  • Loading...

More Telugu News