Pothula Suneetha: పవన్ కల్యాణ్ పై వైసీపీ మహిళా ఎమ్మెల్సీ తీవ్ర వ్యాఖ్యలు

Pothula Suneetha slams Pawan Kalyan
  • జనసేన వీరమహిళలతో పవన్ సమావేశం
  • పవన్ పై ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత
  • మహిళల గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదని విమర్శలు
  • పవన్ తన భార్యలకు ఎలాంటి గౌరవం ఇచ్చాడో అందరికీ తెలుసని ఎద్దేవా

వైసీపీ మహిళా ఎమ్మెల్సీ పోతుల సునీత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ కల్యాణ్ పడుతున్న తపనను కాపు జాతి క్షమించదని అన్నారు. స్త్రీల పుట్టుకనే చంద్రబాబు అవమానించారని, అలాంటి వ్యక్తితో పవన్ కల్యాణ్ అంటకాగుతున్నారని మండిపడ్డారు. 

ఇవాళ జనసేన వీరమహిళలతో పవన్ కల్యాణ్ సమావేశమైన నేపథ్యంలో, పోతుల సునీత స్పందించారు. మహిళల గురించి మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్ కు ఉందా? అని నిలదీశారు. పవన్ తన భార్యలకు ఎలాంటి గౌరవం ఇచ్చాడో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. 

ప్రజాకోర్టులో శిక్షిస్తానని పవన్ కల్యాణ్ చెబుతున్నాడని, అసలు ప్రజాకోర్టు అంటే ఏమిటో పవన్ కల్యాణ్ కు తెలుసా? అని పోతుల సునీత ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News