CM Jagan: విజయవాడ రాజ్ భవన్ లో 'ఎట్ హోం' కార్యక్రమం.... హాజరైన సీఎం జగన్ దంపతులు

CM Jagan attends At Home in Raj Bhavan
  • నేడు భారత స్వాతంత్ర్య దినోత్సవం
  • 'ఎట్ హోం' కార్యక్రమం ఏర్పాటు చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్
  • గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక తొలి తేనీటి విందు

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్ లో 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అతిథ్యమిచ్చిన ఈ అధికారిక కార్యక్రమానికి సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు జోగి రమేశ్, ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ హాజరయ్యారు. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు, సీపీఐ రాష్ట్ర  కార్యదర్శి రామకృష్ణ  కూడా పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. 

ఏపీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక జస్టిస్ అబ్దుల్ నజీర్ తొలిసారిగా ఏర్పాటు చేసిన 'ఎట్ హోం' కార్యక్రమం ఇదే. విశాఖ పర్యటన నేపథ్యంలో విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News