Bhagavanth Kesari: బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

balakrishnas film bhagavanth kesari is a remake of harikrishna film
  • బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి
  • గతంలో హరికృష్ణ తీసిన స్వామి సినిమాకు రీమేక్ అంటూ పుకార్లు
  • అందులో నిజం లేదన్న చిత్ర నిర్మాణ సంస్థ
  • అసలు నిజం అక్టోబర్ 19న తెలుస్తుందని ట్వీట్

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, యువరత్న నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. వచ్చే దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌‌తో సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. అయితే కొన్ని రోజులుగా భగవంత్ కేసరి మూవీ విషయంలో ఓ పుకారు షికారు చేస్తోంది. 

నందమూరి హరికృష్ణ హీరోగా గతంలో వచ్చిన ‘స్వామి’ చిత్రానికి ఇది అనధికార రీమేక్‌ అనే రూమర్లు వస్తున్నాయి. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. ‘2004లో వచ్చిన స్వామి సినిమాకు భగవంత్ కేసరి రీమేక్’ అంటూ ట్విట్టర్‌‌లో పోస్టర్ షేర్ చేసిన వారికి రిప్లై ఇచ్చింది. 

‘‘అది నిజం కాదు.. అసలు నిజం ఏంటనేది.. అక్టోబర్‌‌ 19న భారీగా చూస్తారు. ఇంతకుముందు ఎన్నడూ చూడని బాలకృష్ణని బిగ్ స్క్రీన్‌ పై చూస్తారు” అని షైన్ స్క్రీన్స్‌ సంస్థ ట్వీట్ చేసింది. అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది. ఇందులో బాలకృష్ణ కూతురుగా శ్రీలీల కనిపించనుంది. బాలయ్య జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా కనిపించనున్నారు.

  • Loading...

More Telugu News