Ola Electric: ఓలా నుంచి రెండు కొత్త స్కూటర్లు.. ధర రూ.లక్షలోపే

Ola Electric launches S1X and S1X plus electric scooters under one lakh rupees
  • ఓలా ఎస్1ఎక్స్, ఎస్1ఎక్స్ ప్లస్ విడుదల
  • ఎస్1ఎక్స్ లో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు
  • వీటి ధరలు రూ.79,999 నుంచి ప్రారంభం
  • ఎస్1ఎక్స్ ప్లస్ ఆరంభ ధర రూ.99,999
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఓలా మరింత దూకుడుని ప్రదర్శిస్తోంది. రూ.లక్ష లోపే కొత్త స్కూటర్లను తీసుకొచ్చింది. స్వాతంత్య్ర దినాన ఓలా రెండు కొత్త స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. విశేషం ఏమిటంటే, ఈ రెండింటి ధరలు కూడా రూ. లక్షలోపే ఉన్నాయి. ఈ నెల 21 తర్వాత ధరల్లో మార్పు ఉంటుంది. 

ఓలా ఎస్1ఎక్స్ రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. 3 కిలోవాట్ హవర్ బ్యాటరీ కావాలంటే ఎక్స్ షోరూమ్ ధర రూ.89,999. ఇది కూడా ఈ నెల 21 వరకే ఈ ధర అమల్లో ఉంటుంది. ఆ తర్వాత దీని ధర రూ.99,999కు పెరుగుతుంది. ఇక 2 కిలోవాట్ హవర్ బ్యాటరీ ప్యాక్ తో కూడిన ఎస్1 ఎక్స్ తీసుకుంటే ఎక్స్ షోరూమ్ ధర రూ.79,999. ఆగస్ట్ 21 వరకు ఈ ధర అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత రూ.89,999కు పెరుగుతుంది. బుక్ చేసుకుంటే వీటిని డిసెంబర్ నుంచి డెలివరీ చేస్తారు.

ఓలా ఎస్1ఎక్స్ ప్లస్ అనేది రెండో మోడల్. ఇందులో 3 కిలోవాట్ హవర్ బ్యాటరీ ప్యాక్ ధర ఈ నెల 21 వరకు రూ.99,999. ఆ తర్వాత రూ.1,09,999గా ఉంటుంది. వీటి డెలివరీలు సెప్టెంబర్ నుంచే మొదలవుతాయి. ఇందులో 3 కిలోవాట్ హవర్ బ్యాటరీ ఒక్కసారి చార్జ్ తో 151 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఎస్ 1ఎక్స్ ప్లస్ లో గరిష్ట వేగం 90 కిలోమీటర్లు. బూట్ స్పేస్ 34 లీటర్లుగా ఉంది. ఎక్స్ షోరూమ్ ధరకు అదనంగా రిజిస్ట్రేషన్ చార్జీలు ఉంటాయి.
Ola Electric
new scooters
launch
price

More Telugu News