Independence Day 2023: సముద్రం లోపల మువ్వన్నెల జెండా రెపరెపలు.. వీడియో

Independence Day 2023 Indian Coast Guard hoists flag underwater
  • రామేశ్వరం తీరంలో అరుదైన వేడుక
  • నీటి అడుగు భాగాన జెండా ఆవిష్కరణ
  • ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రత్యేక కార్యక్రమం
దేశ స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా భారత కోస్ట్ గార్డ్ ఓ అరుదైన కార్యక్రమాన్ని చేపట్టింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నీటి అడుగున చేపట్టింది. నీటి లోపల జెండాను ఆవిష్కరించిన నావికులు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. 

తమిళనాడులోని రామేశ్వరం తీరంలో సముద్రంలోపల ఇది జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లోకి చేరింది. సైనికులు తమ భుజాలకు ఆక్సిజన్ సిలిండర్లు తగిలించుకుని నీటి అడుగు భాగానికి వెళ్లి ఈ వేడుకను నిర్వహించారు. ఈ వీడియోని ఇప్పటికే లక్షన్నర మంది వీక్షించారు. ఇది గర్వకారణమంటూ యూజర్లు కామెంట్ చేస్తున్నారు.
Independence Day 2023
Coast Guard
hoists flag
underwater

More Telugu News