Harsha Kumar: అదానీ, అంబానీకి అనుకూలంగా జగన్ పని చేస్తున్నారు: హర్షకుమార్

Jagan is working for Adani and Ambani says Harsha Kumar
  • కేసులకు లొంగిపోయి బీజేపీకి అనుకూలంగా జగన్ పని చేస్తున్నారని హర్షకుమార్ విమర్శ
  • బీజేపీని వీడితేనే పవన్ కు జనాలు బ్రహ్మరథం పడతారని సూచన
  • వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు దండగ అని వ్యాఖ్య

రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను అదానీకి కట్టబెడుతున్నారని, అంబానీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ పై మాజీ ఎంపీ హర్ష కుమార్ విమర్శలు గుప్పించారు. కేసులకు భయపడి బీజేపీకి లొంగిపోయి పని చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంటులో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా జరిగిన చర్చలో వైసీపీ ఎంపీలు మాట్లాడకపోవడం దారుణమని అన్నారు. పార్లమెంటు సాక్షిగా ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. బీజేపీని వీడితేనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జనాలు నీరాజనం పడతారని చెప్పారు. 

జగన్ పాలనలో ఒక్క మంత్రి పేరు అయినా ప్రజలకు తెలుసా? అని హర్షకుమార్ ప్రశ్నించారు. స్టేజిపై జగన్ ఒకరే కూర్చుంటారని... మంత్రి విశ్వరూప్ ను స్టేజిపై మోకాళ్లపై కూర్చోబెట్టారని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు వేస్ట్ అని చెప్పారు. రూ. 5 వేలతో వాలంటీర్లు వారి కుటుంబాలను పోషించుకోగలరా? అని ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News