Hardhik Pandya: ఒక్క సిరీస్ ఓడిపోయినంత మాత్రాన పోయేది ఏమీ లేదు: హార్ధిక్ పాండ్యా

Loosing one series is not a matter says Hardhik Pandya
  • ఓటమిపై మనల్ని మనమే ప్రశ్నించుకోవాలన్న హార్దిక్ పాండ్యా
  • ఓటమిల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
  • కొన్ని సందర్భాల్లో ఓడిపోవడం కూడా మంచే చేస్తుందన్న పాండ్యా
వెస్టిండీస్ తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ ను టీమిండియా 2-3 తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా స్పందిస్తూ... ఓటమిపై మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఓడిపోయిన మ్యాచ్ ల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉందని అన్నారు. ఒక్క సిరీస్ ఓడిపోయినంత మాత్రాన పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని... అయితే మన గోల్ ఏమిటనేది మాత్రం చాలా ముఖ్యమని చెప్పారు. ప్రపంచకప్ కు సమయం దగ్గరపడుతోందని... కొన్ని సందర్భాల్లో ఓడిపోవడం కూడా మంచే చేస్తుందని విమర్శించారు. ఆట అన్న తర్వాత గెలుపు, ఓటమిలు సహజమని చెప్పారు.
Hardhik Pandya
Team India
West Indies

More Telugu News