Nuh district: హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ

Internet services restored in Nuh district
  • రెండు వారాల తరువాత మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్, బ్రాడ్ బ్యాండ్ సేవల పునరుద్ధరణ
  • ఉద్రిక్తతల కారణంగా జులై 31న తొలిసారిగా నిషేధం విధింపు
  • ఘటనపై త్వరలో సిట్ ఏర్పాటు

మతఘర్షణలతో ఇప్పటివరకూ అట్టుడికిన హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. దాదాపు రెండు వారాల తరువాత మొబైల్ ఇంటర్నెట్, ఎస్‌ఎమ్ఎస్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను పునరుద్ధరించారు. జిల్లాలో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగడంతో జులై 31న ఈ సేవలపై నిషేధం విధించారు. విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తున్న ఓ మతపరమైన ఊరేగింపును కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణలు మొదలయ్యాయి. గోరక్షకుడు మోనూ మనేసర్ ఈ ఊరేగింపులో పాల్గొంటాడన్న వార్త ఉద్రిక్తతలకు నాంది పలికింది. 

ఈ గొడవల్లో ఆరుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఈ ఘర్షణలో మరణించిన వారిలో ఇద్దరు హోం గార్డ్స్, ఓ ముస్లిం మతపెద్ద ఉన్నారు. నూహ్ జిల్లాతో పాటూ చుట్టుపక్కల ఉన్న గురుగ్రామ్, పల్వాల్, ఫరీదాబాద్, హర్యానాలోని ఇతర జిల్లాలకూ ఈ గొడవలు వ్యాపించాయి. పలుప్రాంతాల్లోని షాపులు, ఫుడ్ జాయింట్స్ మూకల దాడిలో నాశనమయ్యాయి. కాగా, ఈ గొడవల్లో మనేసర్ పాత్ర ఏంటో తేల్చేందుకు సిట్ ఏర్పాటు కానుంది.

  • Loading...

More Telugu News