Nandyala: స్నేహితులతో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

Nandyala Youth succumbs to heartattack while playing cricket with friends
  • నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలో విషాద ఘటన
  • ఆదివారం స్నేహితులతో క్రికెట్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిన యువకుడు
  • స్థానికులు బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిన వైనం
  • కుమారుడిని కోల్పోయినందుకు కన్నీరుమున్నీరయిన తల్లిదండ్రులు

మాయదారి గుండెపోటు మరో యువకుడిని బలితీసుకుంది. నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్ కాలనీకి చెందిన మహేంద్ర(22) ఆదివారం మధ్యాహ్నం క్రికెట్ ఆడుతూ అకస్మాత్తుగా మరణించాడు. కాలనీ సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అతడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. 

యువకుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. చేతికందివచ్చిన కొడుకు హఠాత్తుగా దూరమవడంతో ఆ తల్లిదండ్రుల దుఃఖానికి అంతేలేకుండా పోయింది.

  • Loading...

More Telugu News