Nani: అమ్మాయిలు విపరీతంగా అభిమానించే ఇద్దరు హీరోలు ఈ స్టేజి మీద ఉన్నారు: నాని

Nani and Rana attends as chief guests to Dulquer Salmaan King Of Kotha pre release event in Hyderabad
  • హైదరాబాదులో కింగ్ ఆఫ్ కోతా ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథులుగా రానా, నాని హాజరు
  • దుల్కర్ సల్మాన్, రానా అంటే అమ్మాయిలకు పిచ్చి అని నాని వెల్లడి
  • నికార్సయిన పాన్ ఇండియా హీరో అంటే దుల్కర్ సల్మానే అని వ్యాఖ్యలు
దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కింగ్ ఆఫ్ కోతా'. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్  హైదరాబాద్ లో నిర్వహించారు. టాలీవుడ్ హీరోలు నాని, రానా దగ్గుబాటి ఈ వేడుకకు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, అమ్మాయిలు విపరీతంగా అభిమానించే ఇద్దరు హీరోలు ఈ స్టేజి మీదనే ఉన్నారంటూ... దుల్కర్ సల్మాన్, రానా గురించి ప్రస్తావించాడు. దుల్కర్, రానా అంటే అమ్మాయిలకు పిచ్చి అని పేర్కొన్నాడు. అసలు సిసలైన పాన్ ఇండియా హీరో అంటే దుల్కర్ సల్మానే అని నాని అభిప్రాయపడ్డాడు. దుల్కర్ కోసం బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ వరకు అందరు డైరెక్టర్లు కథలు రాస్తుంటారని చెప్పుకొచ్చాడు.

'సీతారామం' సినిమాతో దుల్కర్ తెలుగువాడయ్యాడని పేర్కొన్నాడు. దుల్కర్ 'ఓకే బంగారం' చిత్రంలో తాను గొంతు అరువిచ్చానని నాని గుర్తుచేసుకున్నారు. ఇక 'కింగ్ ఆఫ్ కోతా' చిత్రం ట్రైలర్ అదరిపోతోందని, హిట్ గ్యారంటీ అని చెప్పాడు. 

పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న 'కింగ్ ఆఫ్ కోతా' చిత్రం ఆగస్టు 24న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించింది. రితికా సింగ్, అనైకా సురేంద్రన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.
Nani
Dulquer Salmaan
Rana
King Of Kotha
Pre Release Event
Hyderabad

More Telugu News