Kasani Jnaneswar: తెలంగాణ టీడీపీ బస్సు యాత్రలో చంద్రబాబు కూడా పాల్గొంటారు: కాసాని జ్ఞానేశ్వర్

Kasani Jnaneswar said Chandrababu will participate TTDP Bus Tour
  • తెలంగాణలో పుంజుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు
  • ఈ నెల 23 నుంచి బస్సు యాత్ర
  • జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర
  • ఆపై జిల్లాల్లోనూ యాత్ర 
తెలంగాణలో పూర్వ వైభవాన్ని పొందేందుకు తెలుగుదేశం పార్టీ గట్టిగా కృషి చేస్తోంది. ఖమ్మం సభకు విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో తెలంగాణ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణ టీడీపీ పగ్గాలు కాసాని జ్ఞానేశ్వర్ కు అప్పగించాక, పార్టీ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 

తాజా కార్యాచరణపై టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వివరాలు తెలిపారు. ఈ నెల 23 నుంచి టీటీడీపీ బస్సు యాత్ర చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ బస్సు యాత్రలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా పాల్గొంటారని తెలిపారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం నుంచి యాత్రను ప్రారంభిస్తామని వివరించారు. 

జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని కాసాని పేర్కొన్నారు. అనంతరం, జిల్లాల్లో బస్సు యాత్ర చేపడతామని వెల్లడించారు.
Kasani Jnaneswar
Chandrababu
Bus Tour
TTDP
GHMC
Telangana

More Telugu News