Dalit Man: ఉచితంగా చికెన్ ఇవ్వలేదని.. దళితుడిని చెప్పులతో చావగొట్టారు!

Dalit man thrashed with slippers for denying free chicken in Uttar Pradesh
  • లలిత్‌పూర్ జిల్లాలో ఘటన
  • ఊరూరు తిరిగి చికెన్ అమ్మే వ్యక్తిపై దాడి
  • నడిరోడ్డుపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన నిందితులు
ఉత్తరప్రదేశ్‌లో దళితులపై దారుణాలకు అంతూపొంతు లేకుండా పోతోంది. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వారిపై దాడులు ఆగడం లేదు. తాజాగా లలిత్‌పూర్ జిల్లాలో మరో దళితుడు దాడికి గురయ్యాడు. ఉచితంగా చికెన్ ఇచ్చేందుకు నిరాకరించిన వ్యక్తిని రోడ్డుపైనే చెప్పులతో చావగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మద్యం మత్తులో ఉన్న నిందితులు బాధితుడు సుజన్ అహిర్వార్‌‌ను నడిరోడ్డుపై చెప్పులతో కొడుతుండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బైక్‌పై తిరుగుతూ గ్రామాల్లో చికెన్ విక్రయించే అహిర్వార్ వద్ద నిందితులు చికెన్ తీసుకున్నారు. డబ్బులు అడగడంతో రెచ్చిపోయారు. అతడిని పట్టుకుని ఈడ్చుకుంటూ చెప్పులతో దాడిచేశారు. వదిలేయాలని ప్రాధేయ పడుతున్నా కనికరం లేకుండా విచక్షణ రహితంగా దాడిచేశారు. వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Dalit Man
Uttar Pradesh
Lalitpur
Free Chicken

More Telugu News