Canada: కెనడాలో హిందూ దేవాలయం గేటుపై ఖలిస్థానీ పోస్టర్లు

Hindu temple in Canada vandalized by putting up posters on gates
  • బ్రిటీష్ కొలంబియాలోని లక్ష్మీనారాయణ్ దేవాలయాన్ని అగౌరవపరిచిన నిందితులు
  • ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ నేత హత్యలో భారత్ పాత్ర తేల్చాలంటూ గుడి గేటుపై పోస్టర్లు
  • కెనడాలో హిందూ దేవాలయాలను అగౌరపరచడం ఈ ఏడాది ఇది మూడోసారి

కెనడాలో ఖలిస్థానీలు మరో హిందూ దేవాలయాన్ని అగౌరవ పరిచారు. నిన్న రాత్రి బ్రిటీష్ కొలంబియాలోని సర్రీ ప్రాంతంలోగల ప్రముఖ లక్ష్మీనారాయాణ్ దేవాలయం ప్రధాన గేటుపై ఖలీస్థానీ పోస్టర్లు అంటించారు. ‘‘జూన్ 18 నాటి హత్యలో భారత్ పాత్ర ఎంతో తేల్చాలి’’ అన్న రెండు పోస్టర్లను అంటించి వెళ్లిపోయారు. ఆ పోస్టర్లపై హర్దీప్ సింగ్ నిజ్జార్ ఫొటో ఉండటం గమనార్హం. 

కెనడాలోని సర్రీలోగల గురునానక్ సిక్ గురుద్వారాకు హర్దీప్ సింగ్ నిజ్జార్ నాయకత్వం వహించేవారు. అంతేకాకుండా ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్‌కు కూడా నేతృత్వం వహించారు. కాగా. జూన్ 18న గురుద్వారా పరిసరాల్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపేశారు. 

కాగా, ఈ ఏడాది హిందూ దేవాలయాలను అగౌరవ పరిచిన ఘటనల్లో ఇది మూడోది. జనవరి 31న బ్రాంప్టన్ నగరంలోని హిందూ దేవాలయం గోడలపై కొందరు భారత వ్యతిరేక రాతలు రాశారు. ఇక ఏప్రిల్‌లో కూడా ఓంటారియోలోని మరో హిందూ దేవాలయాన్ని ఇదే రీతిలో అగౌరవపరిచారు. దేవాలయం గోడలపై నిందితులు పెయింట్ స్ప్రే చేస్తున్న దృశ్యాలను పోలీసులు సోషల్ మీడియాలో పెట్టారు. నిందితులను పట్టుకునేందుకు సహకరించాలని అప్పట్లో ప్రజలను అభ్యర్థించారు.

  • Loading...

More Telugu News