Kishan Reddy: పేదల డబుల్ బెడ్రూం ఇళ్లపై సెప్టెంబరు 4న విశ్వరూప ధర్నా: కిషన్ రెడ్డి

Kishan Reddy says BJP fighting continues for double bedroom houses for poor
  • పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లపై బీజేపీ ఉద్యమం
  • కార్యాచరణ వెల్లడించిన కిషన్ రెడ్డి
  • కేసీఆర్ ది రజాకార్ల ప్రభుత్వమని విమర్శలు
  • డబుల్ బెడ్రూం ఇళ్లు అందాలంటే బీజేపీ సర్కారు రావాలని వెల్లడి 
తెలంగాణలోని పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలన్న డిమాండ్ తో బీఆర్ఎస్ సర్కారుపై ఉద్యమ స్థాయిలో పోరాడాలని బీజేపీ నిర్ణయించుకుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. 

వచ్చే నెల 4వ తేదీన హైదరాబాద్ లో విశ్వరూప ధర్నా చేపడుతున్నామని ప్రకటించారు. ఈ నెల 16, 17 తేదీల్లో బస్తీల్లో సమస్యలపై బస్తీల బాట కార్యక్రమం ఉంటుందని, ఈ నెల 18న మండల కేంద్రాల్లో... ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని వివరించారు. 

కేసీఆర్ ది రజాకార్ల ప్రభుత్వమని కిషన్ రెడ్డి విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు అందాలంటే బీజేపీ సర్కారు రావాలని స్పష్టం చేశారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలంటూ బీజేపీ ఇవాళ హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ ధర్నాలో కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
Kishan Reddy
Double Bedroom
BJP
BRS
KCR
Hyderabad
Telangana

More Telugu News