Hawaii: బూడిదగా మారిపోయిన భూతల స్వర్గం హవాయి.. కాలిపోయిన శవాలతో భయానకంగా!

  • హవాయిలోని లహైనా నగరాన్ని దహించి వేసిన కార్చిచ్చు
  • క్షణాల్లో నగరమంగా విస్తరించిన మంటలు
  • ఇప్పటి వరకు దాదాపు 70 మృతదేహాల గుర్తింపు
Nothing left in Hawaii after fire

శతాబ్దాల చరిత్ర కలిగిన, భూతల స్వర్గంగా పేరుగాంచిన హవాయి ద్వీపం బూడిద కుప్పగా మారిపోయింది. కార్చిచ్చు హవాయి దీవుల్లోని లహైనా నగరాన్ని దహించి వేసింది. నగరంలోని ఇల్లు, వాకిలి అంతా కాలిపోయాయి. ఎటు చూసినా కాలిపోయిన మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 70 మృతదేహాలను గుర్తించారు. 

మంగళవారం రాత్రి మొదలైన కార్చిచ్చు నగరాన్ని దహించివేసింది. హరికేన్ ప్రభావంతో బలమైన గాలుల కారణంగా మంటలు క్షణాల్లో నగరమంతా విస్తరించాయి. ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. సహాయక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇళ్లు, వాహనాలు, జంతువులు, పక్షులు మంటల్లో కాలిపోయాయి. కార్చిచ్చు కారణంగా వేలాది మంది నిరాశ్రయులుగా మారిపోయారు. హవాయి చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద విపత్తు అని అధికారులు తెలిపారు. హవాయిలో ప్రస్తుతం 12 వేల మంది నివాసం ఉంటున్నారు.

More Telugu News