Bhola Shankar: తొలిరోజు రూ.33 కోట్లు వసూలు చేసిన భోళా శంకర్

Bhola Shankar opening day collections details
  • చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్
  • ఓపెనింగ్ డే వసూళ్లపై ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ ప్రకటన
  • వరుస సెలవుల నేపథ్యంలో కలెక్షన్స్ మరింత పెరిగే చాన్స్

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్ నటించిన భోళా శంకర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తొలి రోజు మిశ్రమ స్పందన అందుకుంది. ఇక, ఓపెనింగ్ డే వసూళ్లపై చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో స్పందించింది. 

భోళా శంకర్ చిత్రం బాక్సాఫీసు వద్ద అదిరిపోయే ఆరంభాన్ని అందుకుందని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ వెల్లడించింది. భోళా శంకర్ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున రూ.33 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలిపింది.

కాగా, ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం వరుస సెలవులు కావడంతో, మెగా మూవీకి వసూళ్లు మరింత పెరిగే అవకాశాలున్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • Loading...

More Telugu News