RGV: వాల్తేరు వీరయ్య ఎవరివల్ల ఆడిందో ప్రూవ్ చేయడానికే భోళాశంకర్: ఆర్జీవీ

RGV interesting tweet on Bhola Shankar film
  • భోళాశంకర్ సినిమా విషయంలో దర్శకుడిపై కొంతమంది నెటిజన్ల విమర్శలు
  • ఈ క్రమంలో వాల్తేరు వీరయ్యను ప్రస్తావించిన ఆర్జీవీ
  • వాల్తేరు వీరయ్య ఎవరివల్ల ఆడిందో చెప్పడానికే భోళాశంకర్ తీశారంటూ చురకలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన భోళాశంకర్ సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పందించారు. భోళా శంకర్ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయని, సినిమా అద్భుతమని మెగా అభిమానులు చెబుతున్నారు. అదే సమయంలో సినిమా అంత బాగా లేదనే వాదనలూ వినిపించాయి. భోళా శంకర్ సినిమాను దర్శకుడు మెహర్ రమేశ్ అంత బాగా తెరకెక్కించలేదనే విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలో దర్శకుడు ఆర్జీవీ... చిరంజీవి ఇంతకుముందు సినిమా వాల్తేరు వీరయ్యను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. వాల్తేరు వీరయ్య ఎవరి మూలన ఆడిందో, ప్రూఫ్ చేయడానికి భోళాశంకర్ సినిమా తీసినట్లుగా ఉందని చురకలు అంటించారు. 'వాల్తేరు వీరయ్య ఎవరి మూలాన ఆడిందో , ప్రూవ్ చెయ్యటానికి తీసినట్టుంది బి ఎస్' అని రాసుకొచ్చారు. తద్వారా భోళాశంకర్ సినిమా ఆడలేదనుకుంటే కనుక అందుకు దర్శకుడు కారణమైతే, వాల్తేరు వీరయ్య ఆడిన క్రెడిట్ దర్శకుడిదే అనే అభిప్రాయం వచ్చేలా ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News