Stalin: 'జైలర్' సినిమా చూసిన సీఎం స్టాలిన్

CM Stalin watched Rajinikanth Jailer movie
  • సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న 'జైలర్' మూవీ
  • సినిమా చూసిన స్టాలిన్ కు ధన్యవాదాలు తెలిపిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్
  • మీ ప్రశంసలు తమలో స్ఫూర్తిని నింపాయని వ్యాఖ్య
రజనీకాంత్ తాజా చిత్రం 'జైలర్' సూపర్ హిట్ అయింది. భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తెలుగులో సైతం హిట్ టాక్ తో నడుస్తోంది. మరోవైపు ఈ చిత్రాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వీక్షించారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా నెల్సన్ దిలీప్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... సినిమాను వీక్షించిన స్టాలిన్ సార్ కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. మీ ప్రశంసలు తమలో స్ఫూర్తిని నింపాయని చెప్పారు. మీరు సినిమాను చూడటం వల్ల చిత్ర బృందం మొత్తం ఆనందంగా ఉందని తెలిపింది. మరోవైపు ఈ చిత్రంలో రజినీకాంత్ రిటైర్డ్ పోలీసు అధికారి పాత్రను పోషించారు. ఈ సినిమాలో రజనీకాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
Stalin
Jailer Movie
Tollywood
Rajinikanth

More Telugu News