AP CMO: ఏపీ సీఎంవోలో డిజిటల్ సంతకాల దుర్వినియోగం కేసులో ఐదుగురి అరెస్టు

five accused have been arrested in the case of misuse of digital signatures in cmo
  • కార్యదర్శుల డిజిటల్ సంతకాలను ట్యాంపర్ చేశారన్న సైబర్ క్రైమ్‌ సీఐడీ ఎస్పీ
  • వాటితో సీఎంపీలు జారీ చేశారని వ్యాఖ్య
  • ఒక్కో ఫైల్‌కు రూ.50 వేల దాకా వసూలు చేశారని వెల్లడి
ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో డిజిటల్ సంతకాల దుర్వినియోగం కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్‌ సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్ ప్రకటించారు. కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలను నిందితులు దుర్వినియోగం చేసి సీఎంపీలు జారీ చేశారని చెప్పారు. సీఎంవోలోని రేవు ముత్యాలరాజు, ధనుంజయ్‌రెడ్డి, సీఎస్ జవహర్‌‌రెడ్డి పేషీల్లో పని చేస్తున్న వాళ్లే ఈ నేరానికి పాల్పడ్డారని తెలిపారు. 

‘‘ఒక్కో ఫైల్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా వసూలు చేశారు. ఏప్రిల్ నుంచి 3 నెలల్లో 66 సీఎంపీలు జారీ చేశారు. మొత్తం రూ.15 లక్షల దాకా వసూలు చేసినట్లు గుర్తించాం. అయితే ఏ ఫైలుకూ తుది ఆమోదం రాలేదు” అని వివరించారు. డిజిటల్ సంతకాలను ట్యాంపరింగ్ చేసినట్లు తొలుత సీఎం పేషీలోని కార్యదర్శి భరత్ గుప్తా గుర్తించారని తెలిపారు. ఈ వ్యవహారంలో తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు.
AP CMO
digital signatures
cyber crime cid
accused arrested

More Telugu News