Raghu Rama Krishna Raju: రజనీకాంత్ గారు, మిమ్మల్ని విమర్శించిన వాళ్లకి ఇప్పుడు “అర్థమైంది రాజా”: ఎంపీ రఘురామ కృష్ణరాజు

MP Raghu rama all praises Rajinikanth after watching JAILER
  • కుటుంబ సమేతంగా జైలర్ సినిమా చూశానన్న ఎంపీ
  • రెండేళ్లలో తాను చూసిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటని కితాబు
  • చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన రఘురామ
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా అద్భుతంగా ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. కుటుంబ సమేతంగా సినిమా చూశానని చెప్పారు. పనిలో పనిగా రజనీకాంత్ ను విమర్శించిన వారికి ఆయనంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది అంటూ ట్వీట్ చేశారు.  వైసీపీ నేతలకు పరోక్షంగా చురకలు అంటించారు. రజనీకాంత్‌తో దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు.

‘రజనీకాంత్ గారు, మిమ్మల్ని విమర్శించిన వాళ్లకి ఇప్పుడు “అర్థమైంది రాజా”. ఫ్యామిలీతో కలిసి ‘జైలర్‌’ చూశా. గత రెండేళ్లలో నేను చూసిన అత్యుత్తమ సినిమాల్లో ఇదొకటి. అందరూ ఈ సినిమాను తప్పక చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ చరిష్మా, స్వాగ్ అద్భుతం. ఆయన అత్యుత్తమంగా నటించారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్, ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించిన విధానం అత్యద్భుతంగా వున్నాయి. సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన బీజీఎం అగ్రస్థానంలో ఉంది. ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని నేను నమ్ముతున్నా. టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు’ అని రఘురామ ట్వీట్ చేశారు.
Raghu Rama Krishna Raju
Rajinikanth
Jailer
YSRCP

More Telugu News