Kodandaram: ప్రొఫెసర్ కోదండరాం గృహ నిర్బంధం

professor kodandaram staged a silent protest
  • గ్రూప్–2 వాయిదా కోసం గన్‌ పార్క్ వద్ద దీక్షకు అఖిలపక్షం పిలుపు
  • కోదండరాం ఇంటికి చేరుకుని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు
  • ఓయూలో కూడా విద్యార్థుల ముందస్తు అరెస్టులు
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గ్రూప్–2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఈ రోజు గన్‌ పార్క్ వద్ద దీక్షకు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్లకుండా హైదరాబాద్‌ తార్నాకలోని కోదండరాం ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. గ్రూప్ 2 పరీక్షను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ తప్పిదాలను నిరుద్యోగుల మీద నెట్టడం సరికాదని అన్నారు. ఒకేసారి మూడు రకాల పోటీ పరీక్షలు ఉండటం వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారని చెప్పారు. తర్వాత మౌన దీక్షకు కూర్చున్నారు. అంతకుముందు ఓయూ విద్యార్థులను కూడా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. గన్‌పార్క్‌కు వెళ్లకుండా వారిని అదుపులోకి తీసుకున్నారు.
Kodandaram
silent protest
Group 2
gun park
TSPSC

More Telugu News