Virat Kohli: ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు తీసుకుంటున్నాడనే వార్తలపై విరాట్ కోహ్లీ స్పందన

News about my social media earnings is not true says Virat Kohli
  • ఇన్స్టాలో కోహ్లీ సంపాదనపై వైరల్ అవుతున్న వార్త
  • ఆ వార్తల్లో నిజం లేదన్న కోహ్లీ
  • జీవితంలో తాను అందుకున్న ప్రతి దానికి రుణపడి ఉన్నానని వ్యాఖ్య

ప్రస్తుత క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రపంచంలో ఏ క్రికెటర్ కు కూడా లేనంత సంపాదన కోహ్లీకి ఉంది. ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న ఆయనకు భారీ ఆదాయం ఉంది. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా కూడా ఆయన భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. కోహ్లీ నెట్ వర్త్ రూ. వెయ్యి కోట్లకు పైనే ఉంటుందని స్టాక్ గ్రో సంస్థ అంచనా వేసింది. 

మరోవైపు ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు ఏకంగా రూ. 11.45 కోట్లు వసూలు చేస్తున్నాడంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తపై కోహ్లీ స్పందించాడు. ట్విట్టర్ ద్వారా కాసేపటి క్రితం క్లారిటీ ఇచ్చారు. జీవితంలో తాను అందుకున్న ప్రతిదానికీ రుణపడి ఉన్నానని కోహ్లీ చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా తన సంపాదన గురించి వస్తున్న వార్తలు నిజం కాదని తెలిపాడు. 

  • Loading...

More Telugu News