prahlad joshi: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ప్రహ్లాద్ జోషి

Pralhad Joshi Counters Rahuls Attack On PM Modi
  • భారతమాత పదాలను రికార్డ్‌ల నుండి తొలగించడం అవమానకరమన్న రాహుల్
  • తాము తొలగించింది అమర్యాదకరమైన పదాలను మాత్రమేనని జోషి స్పష్టీకరణ
  • బారతమాత అనే పదాన్ని కాదని వివరణ
భారతమాత అనే పదాలను పార్లమెంట్ రికార్డుల నుండి తొలగించడం అవమానకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ... తాము తొలగించింది అమర్యాదకరమైన పదాలను మాత్రమే అన్నారు. కానీ భారతమాత అనే పదాన్ని కాదన్నారు.

అవిశ్వాస తీర్మానంలో భాగంగా మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలోని పదాలను రికార్డుల నుండి తొలగించడంపై రాహుల్ శుక్రవారం స్పందించారు. తాను ఆధారాలు లేకుండా మాట్లాడలేదని, మణిపూర్ పరిస్థితులు అలాగే ఉన్నాయని, ఇరువర్గాల మధ్య చర్చలు లేవన్నారు. కేవలం హింస మాత్రమే చెలరేగుతోందన్నారు.
prahlad joshi
Rahul Gandhi
Congress
BJP

More Telugu News