BJP: వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరితో పొత్తు ఉంటుందో చెప్పిన జీవీఎల్

GVL says BJP and Janasena will go with alliance
  • మోదీ చెప్పే సమాధానం వినే ధైర్యం విపక్షాలకు లేదన్న జీవీఎల్
  • అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఓటింగ్‌లో పాల్గొనకుండా పారిపోయాయని వ్యాఖ్య
  • రాహుల్ గాంధీ అచ్చం రోమియో గాంధీలా ప్రవర్తించారని ఎద్దేవా
  • జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని వెల్లడి 

ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని, మరో పార్టీతో ఉండదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం వినే ధైర్యం విపక్షాలకు లేకుండా పోయిందన్నారు. 

అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలే ఓటింగ్‌లో పాల్గొనకుండా పారిపోయాయన్నారు. రాహుల్ గాంధీ అచ్చం రోమియో గాంధీలా ప్రవర్తించారని ఎద్దేవా చేశారు. యూపీఏ పేరును ఇండియాగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.

  • Loading...

More Telugu News