Dwarampudi Chandrasekhar Reddy: చిరంజీవిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆసక్తికర వ్యాఖ్యలు

Dwarampudi comments on Chiranjeevi
  • చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని తాను భావించడం లేదన్న ద్వారంపూడి
  • రాజకీయాలకు సరిపోననే పాలిటిక్స్ కు దూరమయ్యారని వ్యాఖ్య
  • చిరంజీవికి సినిమాల్లోనే సౌకర్యంగా ఉంటుందన్న ద్వారంపూడి
మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో వస్తారని తాను భావించడం లేదని ఆయన అన్నారు. రాజకీయాలకు సరిపోనని భావించే చిరంజీవి పాలిటిక్స్ కు దూరమయ్యారని, పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించారని చెప్పారు. వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారని అన్నారు. చిరంజీవికి సినిమాల్లోనే సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని... పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమాలపై ఎందుకు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చిరుపై వైసీపీ మంత్రులు విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు.
Dwarampudi Chandrasekhar Reddy
YSRCP
chira
Tollywood

More Telugu News