Viveka murder case: వివేకా హత్య కేసు.. బెయిల్‌ కోసం హైకోర్టులో నిందితుల పిటిషన్

ys viveka murder case petition of the accused in the high court
  • గతంలో సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్‌‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి బెయిల్‌ పిటిషన్
  • జూన్‌లో తిరస్కరించిన సీబీఐ కోర్టు
  • తాజాగా హైకోర్టును ఆశ్రయించిన నిందితులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు వైఎస్ భాస్కర్‌‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్ దాఖలు చేశారు. వీరిద్దరూ వేసిన బెయిల్‌ పిటిషన్‌ను జూన్‌లో సీబీఐ కోర్టు తిరస్కరించడంతో తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News