Rahul Gandhi: యాభై ఏళ్ల పెద్దావిడకు రాహుల్ ఫ్లైయింగ్ కిస్ ఎందుకిస్తారు..?: బీహార్ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే

Why would Rahul Gandhi give flying kiss to a 50 year old woman asks bihar mla
  • ఆయన ఇవ్వాలనుకుంటే యువతులకే ఇస్తారన్న నీతూ సింగ్  
  • రాహుల్ ఒప్పుకుంటే పెళ్లికి చాలామంది యువతులు రెడీగా ఉన్నారని వెల్లడి
  • నిరాధార ఆరోపణలతో తమ లీడర్ పై బురదజల్లుతున్నారని మండిపాటు
కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ జరుగుతున్న వివాదంపై బీహార్ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నేతకు అమ్మాయిలకు కొదవలేదని, ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి చాలామంది యువతులు సిద్ధంగా ఉన్నారని పార్టీ బీహార్ ఎమ్మెల్యే నీతూ సింగ్ అన్నారు. అలాంటపుడు యాభై ఏళ్ల వృద్ధురాలికి ఫ్లయింగ్ కిస్ ఇవ్వాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఏముందని ఆమె ఎదురు ప్రశ్నించారు.

ఈమేరకు ఎమ్మెల్యే నీతూ సింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ లీడర్ పై బీజేపీ కావాలనే, నిరాధార ఆరోపణలతో బురదజల్లుతోందని నీతూ సింగ్ ఈ వీడియోలో మండిపడ్డారు. కాగా, నీతూ సింగ్ వీడియోపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ట్విట్టర్లో స్పందిస్తూ.. నీతూ సింగ్ వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతూసింగ్ తీరు అవమానకరంగా ఉందని విమర్శించారు. భాటియాతో పాటు బీజేపీ మరో అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళల వ్యతిరేకి అని, రాహుల్ గాంధీని కాపాడుకోవడానికి ఆ పార్టీ నేతలు ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు.
Rahul Gandhi
Congress
flying kiss
Parliament
bihar mla
50 year old
Smriti Irani

More Telugu News