undavalli sridevi: ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతా: చంద్రబాబుతో భేటీ అనంతరం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

MLA Sridevi meets TDP chief Chandrababu Naidu
  • తాను ఇబ్బందులు పడుతున్న సమయంలో చంద్రబాబు, లోకేశ్ మద్దతిచ్చారన్న ఎమ్మెల్యే
  • వైసీపీ గూండాలు తనపై దాడి చేశారని ఆరోపణ
  • ప్రస్తుతం తెలంగాణలో వుంటున్నట్టు వెల్లడి 

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం సాయంత్రం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. వీరిద్దరు దాదాపు గంటసేపు సమావేశమయ్యారని సమాచారం. పార్టీ మార్పుతో పాటు ఇతర అంశాలపై చర్చించారని తెలుస్తోంది. టీడీపీ అధినేతతో భేటీ అనంతరం శ్రీదేవి మాట్లాడుతూ... తాను ఇబ్బందులు పడుతున్న సమయంలో చంద్రబాబు, లోకేశ్ మద్దతు ఇచ్చారని చెప్పారు. చంద్రబాబును తాను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. వైసీపీ గూండాలు తన మీద దాడులు చేశారని ఆరోపించారు. ఇక దిశ చట్టం ఎక్కడ ఉందో చెప్పాలన్నారు.

ప్రస్తుతం తాను తెలంగాణలో నివసిస్తున్నానని, తనకు రక్షణపై చంద్రబాబును అడిగానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే అంశంపై నాలుగున్నర నెలలపాటు ఆలోచించానని, చంద్రబాబు, జగన్ పాలనలను బేరీజు వేసుకున్నానన్నారు. తాను ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతానన్నారు. ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఆర్5 జోన్‌లో ప్లాట్లు ఇవ్వవద్దని హైకోర్టు చెప్పిందన్నారు.

  • Loading...

More Telugu News