NTPC: విశాఖ పరవాడ ఎన్టీపీసీలో ప్రమాదం... ఇద్దరి మృతి

Two labour died in Visakha NTPC incident
  • సింహాద్రి ఎన్టీపీసీలో ఎఫ్ జీడీ నిర్మాణపనులు
  • తెగిపోయిన బెల్ట్
  • 15 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయిన కార్మికులు
  • ముగ్గురి పరిస్థితి విషమం
విశాఖపట్నం పరవాడలోని సింహాద్రి ఎన్టీపీసీలో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాద్రి ఎన్టీపీసీలో ఎఫ్ జీడీ నిర్మాణ పనులు జరుగుతుండగా, ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కేబుల్ ట్రాక్ బెల్ట్ తెగిపోవడంతో 15 మీటర్ల ఎత్తు నుంచి నిర్మాణ కార్మికులు కిందపడిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులు పశ్చిమ బెంగాల్ కు చెందినవారిగా గుర్తించారు.
NTPC
Visakhapatnam
Accident

More Telugu News