బీజేపీకి మిత్రపక్షం షాక్.. అవిశ్వాస తీర్మానానికి మద్దతు!
- మిజోరాం ఎన్డీయే భాగస్వామి ఎంఎన్ఎఫ్ అనూహ్య నిర్ణయం
- అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చినప్పటికీ కాంగ్రెస్‌కు అనుకూలం, బీజేపీకి వ్యతిరేకం కాదని వెల్లడి
- హింసను అదుపు చేయడంలో మణిపూర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
అయితే తాము అవిశ్వాసానికి మద్దతివ్వడం ద్వారా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నామని కాదని, బీజేపీని వ్యతిరేకిస్తున్నామని భావించరాదన్నారు. ప్రభుత్వాలు ముఖ్యంగా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమైందన్నారు. ఆ రాష్ట్రంలోని ప్రజల పరిస్థితి తమను తీవ్రంగా కలచివేస్తోందన్నారు. ఈ అంశపై తమ పార్టీ అధ్యక్షుడు, మిజోరామ్ ముఖ్యమంత్రి జొరాంతంగతో మాట్లాడామని, అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో తాను అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేస్తానన్నారు.