Kim Jong Un: టాప్ ఆర్మీ జనరల్ ను బర్తరఫ్ చేసిన కిమ్ జాంగ్.. యుద్ధ సన్నాహకాలకు పిలుపు

  • ఆర్మీ జనరల్ గా రి యోంగ్ గిల్ ను నియమించిన కిమ్ జాంగ్
  • ఆయుధ తయారీ కర్మాగారాల్లో పర్యటించిన కిమ్
  • ఆయుధాల ఉత్పత్తిని పెంచాలని ఆదేశం
Kim Jong Un terminates top army general

ఉత్తర కొరియా టాప్ ఆర్మీ జనరల్ ను ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ బర్తరఫ్ చేశారు. అంతేకాదు యుద్ధానికి సమాయత్తం కావాలంటూ ఆర్మీని ఆదేశించారు. మరోవైపు ఆర్మీ జనరల్ గా రి యోంగ్ గిల్ ను నియమించారు. అయితే రక్షణ మంత్రిగా రి కొనసాగుతారా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు. అమెరికా, దక్షిణ కొరియాలతో ఉత్తర కొరియాకు ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం ఆయుధ తయారీ కర్మాగారాల్లో ఆయన పర్యటించారు. అత్యాధునిక ఆయుధాలను స్వయంగా పరిశీలించారు. ఆయుధాల ఉత్పత్తిని, వాటి సామర్థ్యాన్ని విస్తరించే విధంగా కిమ్ జాంగ్ లక్ష్యాన్ని నిర్దేశించినట్టు సమాచారం. అత్యాధునిక ఆయుధాలు, పరికరాలతో కసరత్తులు నిర్వహించాలని ఆదేశించారు. 

More Telugu News