Rajinikanth: హిమాలయాలకు సూపర్‌‌స్టార్ రజనీకాంత్!

Superstar Rajinikanth left for the Himalayan trip
  • ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘జైలర్’
  • కొన్నేళ్లుగా తన చిత్రం రిలీజ్‌ సమయంలో హిమాలయలకు వెళ్తున్న రజనీ
  • బుధవారం చెన్నై నుంచి బెంగళూరుకు.. అక్కడి నుంచి హిమాలయాలకు..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఇందుకు ఒకరోజు ముందే రజనీ హిమాలయాలకు వెళ్లారు. బుధవారం ఈ మేరకు యాత్రకు బయలుదేరారు. సాధారణంగా తన సినిమా విడుదలయ్యే సమయంలో హిమాలయాలకు రజనీకాంత్ వెళ్తుంటారు. కొన్నేళ్లుగా ఇలానే చేస్తున్నారు. 

జైలర్ రిలీజ్ నేపథ్యంలో చెన్నై నుంచి బెంగళూరుకు ఆయన చేరుకున్నారు. తర్వాత అక్కడి నుంచి హిమాలయాలకు బయల్దేరి వెళ్లారు. 
నెల్సన్‌ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ‘జైలర్‌’‌ సినిమాలో మలయాళ, కన్నడ సూపర్‌‌ స్టార్లు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, సీనియర్ నటులు జాకీష్రాఫ్, రమ్యకృష్ణ, హీరోయిన్ తమన్నా కీలక పాత్రల్లో నటించారు.

  • Loading...

More Telugu News