Jio offer: జియో నుంచి ఇండిపెండెన్స్ డే ఆఫర్

reliance Jio Independence day offer swiggy netmeds discounts
  • రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ లో అదనపు ప్రయోజనాలు
  • ఏడాది పాటు రోజూ 2.5 జీబీ డేటా
  • స్విగ్గీ, నెట్ మెడ్స్, రిలయన్స్ డిజిటల్ కొనుగోళ్లపై తగ్గింపు ఓచర్లు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో పలు ఆకర్షణీయ ప్రయోజనాలతో కూడిన ప్లాన్ ను ప్రకటించింది. రూ.2,999 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ఇంతకుముందు నుంచీ ఉండగా, కొత్తగా అదనపు ప్రయోజనాలను జోడించింది. ఈ ప్లాన్ కాల వ్యవధి ఏడాది. ఉచిత కాల్స్ అపరిమితంగా ఏడాది పాటు చేసుకోవచ్చు. రోజువారీ 2.5 జీబీ చొప్పున హైస్పీడ్ డేటా వినియోగించుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా చేసుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా కంటెంట్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

అదనపు ప్రయోజనాలు
రూ.250 అంతకుమించిన స్విగ్గీ ఆర్డర్ పై రూ.100 డిస్కౌంట్ లభిస్తుంది. యాత్రా సైట్ పై విమాన టికెట్లు బుక్ చేసుకుంటే రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే దేశీయ హోటల్ బుకింగ్ లపై రూ.4,000 తగ్గింపు పొందొచ్చు. అజియో పోర్టల్ లో రూ.999 కొనుగోలుపై రూ.200 తగ్గింపు లభిస్తుంది. నెట్ మెట్స్ ఆర్డర్ రూ.999 విలువ, అంతకు మించి ఉంటే 20 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. రిలయన్స్ డిజిటల్ స్టోర్ లో ఆడియో ఉత్పత్తులపై 10 శాతం డిస్కౌంట్, గృహోపకరణాలపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
Jio offer
independence day
prepaid plan
discounts

More Telugu News