Chandrababu: కళాకారులతో చంద్రబాబు చిందేసిన వేళ... వీడియో ఇదిగో!

Chandrababu dances with artists in Vijayanagaram
  • సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు యుద్ధభేరి
  • ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన టీడీపీ అధినేత
  • విజయనగరంలో చంద్రబాబుకు ఘస్వాగతం
  • కళాకారులతో కలిసి కాలు కదిపిన చంద్రబాబు

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వివిధ ప్రాజెక్టులను సందర్శించిన చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పరిశీలన చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన విజయనగరం చేరుకున్నారు. విజయనగరంలో చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ, చంద్రబాబు సైతం కళాకారులతో కలిసి డ్యాన్స్ చేశారు. టీడీపీ అధినేత ఆనంద నృత్యం చేయడం పార్టీ శ్రేణులను అలరించింది. దీనికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Loading...

More Telugu News