Pawan Kalyan: హీరోగా మహేశ్ బాబు సాధించిన విజయాలు సినీ పరిశ్రమ వృద్ధికి దోహదపడ్డాయి: పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes Mahesh Babu on his birthday
  • నేడు మహేశ్ బాబు పుట్టినరోజు
  • మహేశ్ బాబు తనదైన పంథా కలిగిన హీరో అని పేర్కొన్న పవన్
  • తండ్రి అడుగుజాడల్లో వెళుతూ, విభిన్న పాత్రల్లో మెప్పిస్తున్నాడని కితాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇవాళ (ఆగస్టు 9) పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మహేశ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. 

తెలుగు చలన చిత్రసీమలో తనదైన పంథా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు మహేశ్ బాబు అని అభివర్ణించారు. హీరోగా మహేశ్ బాబు అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయని కొనియాడారు. 

తండ్రి నటశేఖర కృష్ణ గారి అడుగుజాడల్లో నడుస్తూ, విభిన్న పాత్రల్లో మెప్పించే అభినయ సామర్థ్యం మహేశ్ బాబు సొంతం అని కితాబునిచ్చారు. సోదర సమానుడైన మహేశ్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు.

  • Loading...

More Telugu News