Ram Charan: మహేశ్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్

Ram Charan conveys Birthday wishes to Mahesh Babu
  • నేడు (ఆగస్టు 9) మహేశ్ బాబు పుట్టినరోజు
  • సూపర్ స్టార్ పై శుభాకాంక్షల వెల్లువ
  • హ్యాపీ బర్త్ డే మహేశ్ అంటూ ట్వీట్ చేసిన రామ్ చరణ్ 
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నేడు 48వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. జన్మదినం సందర్భంగా మహేశ్ బాబుపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్... మహేశ్ బాబుకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించారు. 

"హ్యాపీ బర్త్ డే మహేశ్... ఆయురారోగ్యాలతో, మరెన్నో సంవత్సరాల పాటు విజయవంతంగా కెరీర్ కొనసాగించాలి" అంటూ రామ్ చరణ్ ఆకాంక్షించారు. మహేశ్ బాబు, రామ్ చరణ్ మంచి స్నేహితులు అని తెలిసిందే. ఇరువురు తమ కుటుంబాలతో కలిసి గతంలో విహారయాత్రలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Ram Charan
Mahesh Babu
Birthday
Wishes
Tollywood

More Telugu News