Mahesh Babu: మహేశ్‌బాబుకు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన అభిమానులు!

fans name star after superstar mahesh babu on his birthday
  • ఈ రోజు మహేశ్ బాబు పుట్టినరోజు
  • ఓ నక్షత్రానికి ఆయన పేరును రిజిస్టర్ చేసిన అభిమానులు 
  • RA:12H33M29S అనే నక్షత్రానికి మహేశ్ బాబు పేరు

సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయనకు అరుదైన బహుమతి ఇచ్చారు. బిరుదుకు తగ్గట్లే ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూపర్‌‌ ‘స్టార్‌’‌ను చేశారు. ఒక నక్షత్రానికి ఆయన పేరును రిజిస్టర్ చేశారు. ఈ విషయాన్ని గ్లోబల్ స్టార్ రిజిస్ట్రేషన్ సంస్థ కూడా అధికారికంగా ప్రకటించింది. ‘RA:12H33M29S’ అనే నక్షత్రానికి మహేశ్ బాబు పేరును పెట్టినట్లు వెల్లడించింది. 

ఇక మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు పోటెత్తాయి. ఆయన ఎప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలంటూ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, డైరెక్టర్ హరీశ్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరో విజయ్ దేవరకొండ తదితర ఎంతో మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘గుంటూరు కారం’ సినిమాలో మహేశ్ బాబు నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

  • Loading...

More Telugu News