Bihar: షాకింగ్.. 13 ఏళ్ల బాలికపై 28 రోజుల పాటు అత్యాచారం

13 year old in bihar kidnapped and gangraped in bihar
  • బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • గత నెల 9న 13 ఏళ్ల బాలికను కారులో ఎత్తుకెళ్లిన దుండగులు
  • శిథిలావస్థకు చేరిన భవంతిలో బంధించి 28 రోజుల పాటు అత్యాచారం
  • బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లికి కిడ్నాప్ విషయం వెల్లడించిన నిందితులు
  • తాను ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదని తల్లి కన్నీటిపర్యంతం
బీహార్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరుగురు కామాంధులు ఓ బాలికను 28 రోజుల పాటు చెరపట్టి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ముజఫర్‌పూర్‌లో సరైయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. గత నెల 9న కొందరు దుండగులు కారులో వచ్చి ఓ 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. శిథిలావస్థకు చేరుకున్న ఓ భవనంలో ఆమెను బంధించి 28 రోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

బాలిక ఆరోగ్యం విషమించడంతో ఆగస్టు 5న ఆమె తల్లికి ఫోన్ చేసి చిన్నారిని కిడ్నాప్ చేసిన విషయాన్ని వెల్లడించారు. వెంటనే అక్కడకు చేరుకున్న మహిళ తన కూతురిని ఆసుపత్రికి తరలించింది. జులై 9న తాను ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించి ఉంటే తన కూతురికి ఈ గతి పట్టేది కాదంటూ ఆ మాతృమూర్తి గుండెలవిసేలా రోదించడం అక్కడి వారిని కదిలించింది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Bihar
Crime News

More Telugu News