Volunteer: మహిళ వేలిముద్రలతో బ్యాంకు ఖాతాలోని సొమ్మును మాయం చేసిన వలంటీరు

Koyyalgudem Volunteer draws nearly 2 lakhs from a woman account
  • ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఘటన
  • రూ. 1.70 లక్షలు కాజేసిన వలంటీరు
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన ఓ మహిళ ఖాతా నుంచి ఓ వలంటీరు రూ. 1.70 లక్షలు కాజేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన కొట్ర నాగమణి ఇటీవల తన ఖాతాలో రూ. 13,500 జమచేసింది. అనంతరం తన ఖాతాలో మొత్తం ఎంత ఉందని బ్యాంకు అధికారులను అడగ్గా, ఇప్పుడు జమచేసిన మొత్తం మాత్రమే ఉందని చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. 

ఇటీవల తానెప్పుడూ నగదు తీసుకోలేదని చెప్పడంతో అధికారులు స్టేట్‌మెంట్లు పరిశీలిస్తే వలంటీరు బాగోతం వెలుగులోకి వచ్చింది. వేలిముద్ర ద్వారా రూ. 1.70 లక్షలు కాజేసినట్టు గుర్తించారు. వలంటీరు తన వేలిముద్రలు తీసుకుని నగదు డ్రా చేసి మోసం చేశాడని నాగమణి వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Volunteer
Andhra Pradesh
Eluru
Koyyalagudem

More Telugu News