Dulquer Salmaan: డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పర్యావరణ కార్యక్రమం అంబాసిడర్ గా దుల్కర్ సల్మాన్

WWF appointed Dulquer Salmaan as ambassador for Nature Guardian Program
  • నేచుర్ గార్డియన్ ప్రోగ్రామ్ ను ప్రకటించిన డబ్ల్యూడబ్ల్యూఎఫ్
  • దుల్కర్ సల్మాన్ ను ప్రచారకర్తగా నియమిస్తున్నట్టు వెల్లడి
  • సాధారణ ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణకు మద్దతు ఇవ్వాలని పిలుపు
యూత్ లో మాంచి ఫాలోయింగ్ ఉన్న యువ నటుల్లో దుల్కర్ సల్మాన్ ఒకరు. మలయాళీ అయినప్పటికీ దాదాపు అన్ని భాషల చిత్రాలతో అభిమానులకు దగ్గరయ్యాడు. తండ్రి మమ్ముట్టి ఓ సూపర్ స్టార్ కాగా, ఆ ప్రభావం తనపై పడకుండా సొంత ఇమేజ్ తో కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. 

తాజాగా, దుల్కర్ సల్మాన్ ను వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా విభాగం తన ప్రకృతి సంరక్షణ కార్యక్రమానికి అంబాసిడర్ గా నియమించింది. తమ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి దుల్కర్ సల్మాన్ ను ప్రచారకర్తగా నియమిస్తున్నామని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నామని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వెల్లడించింది. 

పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో కీలకపాత్ర పోషించగలిగిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రభావశీలత కలిగిన వ్యక్తులను తమ ప్రకృతి సంరక్షణ కార్యక్రమం (నేచుర్ గార్డియన్ ప్రోగ్రామ్) ఒక్కచోటికి చేర్చుతుందని పేర్కొంది. 

ప్రకృతి సంరక్షణ కోసం సాధారణ ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పిలుపునిచ్చింది.
Dulquer Salmaan
Ambassador
Nature Guardian Program
WWF India

More Telugu News