Rahul Gandhi: రాహుల్ లేటుగా లేచారేమో!.. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించకపోవడంపై బీజేపీ ఎద్దేవా

maybe rahul gandhi woke up late bjps jibe on change in congress speakers list
  • అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో కొనసాగుతున్న చర్చ 
  • కాంగ్రెస్‌ ప్రసంగీకుల జాబితాలో మార్పులపై బీజేపీ ఎంపీ నిశికాంత్ సెటైర్లు
  • రాహుల్ ఈ రోజు సిద్ధంగా లేరేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు
కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. అవిశ్వాసంపై చర్చను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రారంభించారు. దీనికి బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే స్పందించారు. గొగోయ్ స్థానంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారంటూ లోక్‌సభ సచివాలయానికి లేఖ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

కాంగ్రెస్‌ తరపున ప్రసంగీకుల జాబితాలో మార్పులను ఉద్దేశిస్తూ.. ‘‘రాహుల్ గాంధీ ఈ రోజు(అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించేందుకు) సిద్ధంగా లేరేమో! లేదా లేటుగా లేచారేమో” అని నిశికాంత్ దూబే ఎద్దేవా చేశారు. 
సౌరవ్ గొగోయ్ బాగా మాట్లాడారని ప్రశంసించారు. మణిపూర్ హింసలో తానూ బాధితుడినేనని, అక్కడ తన అంకుల్ గాయపడ్డారని, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.
Rahul Gandhi
no trust motion
Parliament
Lok Sabha
BJP
Nishikant Dubey

More Telugu News