Zaheeruddin Alikhan: గద్దర్ అంతిమయాత్రలో విషాదం... సియాసత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ గుండెపోటుతో మృతి

Siasat MD Zaheeruddin Alikhan died during Gaddar final journey
  • గద్దర్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన జహీరుద్దీన్ అలీఖాన్
  • గద్దర్ అంతిమయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురైన వైనం
  • కిందపడ్డ ఆయనను ఆసుపత్రికి తరలించిన ఇతరులు
  • మరణించినట్టు నిర్ధారించిన వైద్యులు

ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్రలో విషాదం చోటుచేసుకుంది. గద్దర్ అంతిమయాత్రలో పాల్గొన్న ప్రముఖ ఉర్దూ పత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ గుండెపోటుతో మరణించారు. 

జహీరుద్దీన్ అలీఖాన్... గద్దర్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. గద్దర్ భౌతికకాయం ఎల్బీ స్టేడియం నుంచి ఇంటికి తీసుకువచ్చే క్రమంలో ఆయన వాహనం వెంటే ఉన్నారు. కాగా, గద్దర్ అంతిమయాత్రకు భారీగా ప్రజలు తరలి రాగా, అంతిమయాత్ర ప్రారంభమైన సమయంలో తోపులాట చోటుచేసుకుంది. దాంతో, జహీరుద్దీన్ అలీఖాన్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. 

తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయిన ఆయనను ఇతరులు ఆసుపత్రికి తరలించారు. ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. జహీరుద్దీన్ అలీఖాన్ గుండెపోటుకు గురై ఉంటాడని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News