Gaddar: గద్దర్ పార్థివదేహానికి కేసీఆర్ నివాళులు.. గద్దర్ భార్యకు సోనియా గాంధీ సంతాప లేఖ

Sonia Gandhi condolence letter to Gaddar wife
  • అల్వాల్‌లో గద్దర్ పార్థివదేహానికి నివాళులర్పించిన కేసీఆర్
  • కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి
  • వెంట మహమూద్ అలీ, తలసాని, హరీశ్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి చేరుకొని, గద్దర్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి ఓదార్చారు. కేసీఆర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావు నివాళులర్పించారు. అల్వాల్‌లోని మహాభోది స్కూల్‌లో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరోపక్క, గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ సంతాపం తెలిపారు. ఈ మేరకు గద్దర్ భార్య విమలారావుకు లేఖ పంపించారు. అలాగే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తూ 'అశేష జనదారులు.. అనేక అశృధారలు.. గద్దరన్న సంపాదించుకున్న ఆస్తి. ధన్యజీవి… నిన్ను మరువదు ఈ గడ్డ' అంటూ ట్వీట్ చేశారు.
Gaddar
Sonia Gandhi
Andhra Pradesh
Telangana
KCR

More Telugu News