Actor Vijay: ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య హఠాన్మరణం

Kannada actor Vijay wife Spandana passes away
  • థాయ్ లాండ్ పర్యటనకు వెళ్లిన విజయ్ భార్య స్పందన
  • ఈ ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం
  • 2007లో విజయ్ తో స్పందనకు వివాహం

ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర ఇంట విషాదం నెలకొంది. విజయ్ భార్య స్పందన హఠాన్మరణం చెందారు. బ్యాంకాక్ లో ఆమె చనిపోయారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె థాయ్ లాండ్ పర్యటనకు వెళ్లారు. అక్కడే ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఉదయం గుండెలో నొప్పిగా ఉందని ఆమె తనతో ఉన్న వారికి చెప్పారు. ఆసుపత్రికి తరలించే లోపలే ఆమె కన్ను మూశారు. 

బెంగళూరుకు చెందిన పోలీసు అధికారి శివరామ్ కుమార్తె స్పందన. 2007లో విజయ్ తో ఆమెకు పెళ్లయింది. 2016లో విడుదలైన కన్నడ చిత్రం 'అపూర్వ'లో ఆమె నటించారు. విజయ్, స్పందన దంపతులకు శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. మరో 10 రోజుల్లో వీరి వివాహ వార్షికోత్సవం జరగనుంది. ఇంతలో ఆమె కన్నుమూయడం అందరినీ కలచి వేస్తోంది. మరోవైపు, స్పందన మృతి పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News