KTR: ఈసారి కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలక పాత్ర!: కేటీఆర్

  • తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్న మంత్రి
  • చేనేత కార్మికులకు తెలంగాణ చేనేత మగ్గం పేరుతో కొత్త మగ్గాలు ఇస్తున్నట్లు వెల్లడి
  • కేంద్రం చేనేత మీద 5 శాతం జీఎస్టీ వేసిందని విమర్శ
KTR says BRS will play key role in Centre in next government

కేంద్రంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని, అందులో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో నిర్వహించిన చేనేత దినోత్సవంలో కేటీఆర్ పాల్గొని, ప్రసంగించారు. 75 ఏళ్లు దాటిన చేనేతలకు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందన్నారు. కొత్త మగ్గాలకు తెలంగాణ చేనేత మగ్గం అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.

చేనేత కార్మికులకు 16వేల కోట్లకు పైగా కొత్త మగ్గాలు ఇస్తామన్నారు. ఈ రోజు నుండే తెలంగాణ చేనేత మగ్గం పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. టాటాలు మాత్రమే కాదని, తాతలు మెచ్చిన కుల వృత్తులు ఉంటేనే అభివృద్ధి అని కేసీఆర్ చెబుతుంటారన్నారు. చేనేతలకు డీసీసీబీ, టెస్కాబ్ ద్వారా రూ.200 కోట్ల క్యాష్ లిమిట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

చేనేతమిత్ర పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు రూ.3వేలు ఇస్తామన్నారు. ఈ పథకం ఆగస్ట్, సెప్టెంబర్ నుండి అమలు చేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ చేనేత మీద ఐదు శాతం జీఎస్టీ వేశారని, ఇప్పటి వరకు ఏ ప్రధాని ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. కేంద్రానికి నేతన్నల గురించి తెలియదన్నారు.

More Telugu News